మా నలుగురి జంట ఎటువంటి అరమరికలు లేని ప్రేమతో నిండిన ఒక చిన్న కుటుంబంలా తయారైంది. ప్రోత్సహించే తండ్రి, ప్రేమను పంచే తల్లి, ప్రాణంలా నన్ను అల్లుకుపోయే ముద్దులొలికే చెల్లి నాకైతే ఇంతకంటే జీవితంలో మరేది వద్దు అని అనిపిస్తుంది. వీళ్ళ కోసం నా ప్రాణాలు వదులుకోమన్నా సంతోషంగా వదిలేసుకుంటాను, వీళ్లకు ఎటువంటి ఆపదా రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని మనసులోనే ఉద్విగ్నతకు లోనయ్యాను. అమ్మ లేచి నాకు మరియు అంకుల్ కి మధ్య కూర్చుని నా భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని, ఏంటి నాన్న ఏం ఆలోచిస్తున్నావ్? అని నవ్వుతూ అడిగింది. …. నేను అమ్మ వైపు చూసి ఏం లేదు అన్నట్టు నవ్వి అమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టాను. ప్రీతి కూడా అంకుల్ పక్కన చేరి వాటేసుకుని అంకుల్ పెదవులు మీద ముద్దు పెట్టింది. అలా నలుగురం ఇసుకలో వెనక్కి వాలి కొంతసేపు నిశ్శబ్దంగా సేదతీరుతూ ఉండిపోయాము.
కొంచెం చీకటి పడుతున్న సమయానికి అంకుల్ లేచి, ఈరోజు క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసుకుందామా? అని అడిగారు. …. వెంటనే నేను ప్రీతి పైకి లేచి యస్,,, అని అన్నాము. …. అయితే పదండి చెక్కలు తెచ్చుకొని క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసుకుందాం. అలాగే ఈ రోజు సీఫుడ్ గ్రిల్ తీసుకుని తిందాం అని అన్నారు. …. అమ్మ కూడా పైకి లేచి అక్కడికి దగ్గరలో ఉన్న సీసైడ్ బెంచి మీద వెనక్కి వాలి కూర్చుంటూ, అయితే ఈరోజు మీరు వండి పెట్టండి నేను తినిపెడతా అంటూ రిలాక్స్ అయింది. మేము ముగ్గురం వెళ్లి రెడీగా ఉన్న కావలసిన చెక్కలు తెచ్చి క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసి లోపలకి వెళ్లి ఫ్రిడ్జ్ లో ప్యాక్ చేసి ఉన్న చేపలు, రొయ్యలు, ప్లేట్లు, సలాడ్ కోసం కొన్ని కూరగాయలు ఇంకా అవసరమైన సామాన్లన్నీ పట్టుకొని బయటకు వచ్చి గ్రిల్ వెలిగించి మా వంటకం ప్రారంభించాము. ప్రీతికి వండడం అసలే చాతకాదు. ఇక అంకుల్ సంగతి చూస్తే తెచ్చిన ఐటమ్స్ మీద ఉప్పు కారం నూనె అవసరమనుకుంటే పెప్పర్ జల్లి కాల్చడం మినహా ఇంకేమీ రాదు. మా ముగ్గురిలో కొద్దోగొప్పో వంట తెలిసినవాడిని నేనే, అందువలన అంకుల్ తో కలిసి నాకు తెలిసింది చెబుతూ మొత్తానికి ఒక గంట సేపు కష్టపడి కావలసిన భోజనం రెడీ చేసుకున్నాము.
అమ్మ మా పనితనం చూస్తూ మా ముగ్గురు మీద జోకులు వేస్తూ ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత నలుగురం క్యాంప్ ఫైర్ …