NTR: టీడీపీకి 150 సీట్లు రావాలంటే ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనా?
NTR: టీడీపీకి 150 సీట్లు రావాలంటే ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనా?
NTR: టీడీపీకి 150 సీట్లు రావాలంటే ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనా?
NTR: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా గత ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారాడు జూనియర్ ఎన్టీఆర్. అంతే కాకుండా పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఎన్టీఆర్ 30 పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ డ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. గతంలో చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు అంటూ అనేక రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
కానీ ఇప్పటివరకు ఆ వార్తలన్నీ కూడా అవస్తవాలుగానే మిగిలిపోయాయి. ఎన్టీఆర్ అవార్తులపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్పందించలేదు. గతంలో ఒకసారి టిడిపి పార్టీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేయగా ఆ తర్వాత మళ్లీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం ఎన్టీఆర్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ఆశాకిరణం అని, జూనియర్ ఎన్టీఆర్ ఈసారి ఎలక్షన్స్ లో పాల్గొంటే తప్పకుండా టిడిపి విజయం సాధిస్తుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం అభిమానులతో పాటు టిడిపి నేతలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎన్నికలలో కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటే టిడిపికి 150 సీట్లు రావడం గ్యారెంటీ అని వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు టిడిపికి 150 సీట్లు రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అంటూ టిడిపి నేతలు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో టిడిపి పార్టీని కాపాడడం ఎన్టీఆర్ చేతుల్లోనే ఉంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలి అనుకున్నట్లుగా తెలిపారు ఎన్టీఆర్.