నా భార్యకు 50 మంది బాయ్ ఫ్రెండ్స్! నాకు మీరే న్యాయం చేయాలి!
నా భార్యకు 50 మంది బాయ్ ఫ్రెండ్స్! నాకు మీరే న్యాయం చేయాలి!
నా భార్యకు 50 మంది బాయ్ ఫ్రెండ్స్! నాకు మీరే న్యాయం చేయాలి!
సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కడంతో లాభాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయి. నకిలీ సోషల్ మీడియా ఖాతాలను తెరిచి అమాయకులను బురిడి కొట్టించి అనేక రాకల మోసాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తికి సోషల్ మీడియాలో ఓ యువతి నుంచి ఫేస్ బుక్ లో రిక్వస్ట్ వచ్చింది. అస్సలు చేయకుండా మనోడు వెంటనే ఆ రిక్వస్ట్ ను ఆక్సెప్ట్ చేశాడు. అలా కొంత కాలం పాటు ఆమెతో ఛాటింగ్ , మీటింగ్ లు అంటూ తెగ తిరిగాడు. అలా కొంత కాలానికి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా పెళ్లి చేసుకుని సంసారం కూడా చేశారు. కట్ చేస్తే అతడి భార్య గురించి నమ్మలేని నిజం తెలిసింది. ఆ తర్వాత అతడు ఏం చేశాడు? తర్వాత వీరి కథ ఎక్కడికి వెళ్లిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది తమిళనాడు కన్యాకుమారి పరిధిలోని తిరువత్తర్ ప్రాంతం. ఇక్కడే ముత్తురామ్ అనే యువకుడు నివాసం ఉంటూ జిల్లాలోని అటవి శాఖ కార్యాలయంలో పని చేస్తున్నాడు. ఇక తన పని తాను చేసుకుంటు పోతున్న ముత్తురామ్ కు గతంలో నజీనా అనే అమ్మాయి నుంచి ఫేస్ బుక్ లో రిక్వస్ట్ వచ్చింది. దీంతో ఆమె నుంచి రిక్వస్ట్ రావడంతో అస్సలు ఆలస్యం చేయకండా ముత్తురామ్ వెంటనే ఆ రిక్వస్ట్ ను ఆక్సెప్ట్ చేశాడు. అలా కొంత కాలం పాటు ఆమెతో ఛాటింగ్ , మీటింగ్ లు అంటూ తిరిగాడు. దీంతో ఒకరి మనసులు ఒకరికి నచ్చడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇక సమయం దొరికినప్పుడల్లా సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగి ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే నజీనా ప్రియుడు ముత్తురామ్ కు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ఇక ప్రియురాలి మాటను కాదనని ప్రియుడు.. నాకు కూడా నువ్వుంటే ఇష్టమని, ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామని తెలిపాడు.
ఇక నజీనా.. నేను డాక్టర్ ను అని, మనం పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా బతకొచ్చు అనే మాయమాటలు ప్రియుడికి చెప్పింది. ఇదంతా నమ్మిన ప్రియుడు నిజమే అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే తల్లిదండ్రులను ఎదురించి వీరిద్దరూ 2022లో వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అయితే కొంత కాలం తర్వాత నజీనా తన అసలు రూపాన్ని బయటపెట్టింది. తనకు నువ్వు ఎదురుగా కట్నం ఇవ్వాలని భర్తకు చెప్పింది. ఇక భర్త కాదనకుండా ఓ విలువైన కారు, 40 సవర్ల నగలు, రూ.3 లక్షలు కట్నంగా భార్యకు ఇచ్చాడు.
ఇదిలా ఉంటే ఇటీవల భార్య నజీనా ఫోన్ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. దీంతో అప్పటి నుంచి భార్య ఫోన్ ను భర్త ముత్తురామ్ వాడుతున్నాడు. అయితే భార్య ఫోన్ ను భర్త చెక్ చేయగా.. నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. దాదాపుగా 50 మంది బాయ్ ఫ్రెండ్ తో నజీనా సన్నిహితంగా దిగిన ఫోటోలు బయటపడ్డాయి. ఇదే కాకుండా ఫేస్ బుక్ లో చాలా మంది మగాళ్లతో రొమాంటిక్ ఛాటింగ్ చేసినట్లుగా కూడా తెలుసుకున్నాడు. ఇక పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి రజీనా ప్రియుళ్లతో కలిసి తిరుగుతుందనే విషయాన్ని కూడా తెలుసుకున్నాడు. ఇక భార్య చేస్తున్న మోసాన్ని తెలుసుకున్న భర్త తట్టుకోలేక స్థానిక పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. నా భార్యకు 50 బాయ్ ఫ్రెండ్స్ తో సంబంధాలు ఉన్నాయని, నన్ను చాలా మోసం చేసిందని, నాకు మీరే ఎలాగైన న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.