Droham Naya Vanchana and Thyagam – 2 | ద్రోహం (నయ వంచన) & త్యాగం | telugu dengudu kathalu jabardast
Droham Naya Vanchana and Thyagam - 2 | ద్రోహం (నయ వంచన) & త్యాగం | telugu dengudu kathalu jabardast

Droham Naya Vanchana and Thyagam – 2 | ద్రోహం (నయ వంచన) & త్యాగం | telugu dengudu kathalu jabardast

Uday
గతం – ఓ చిన్న అవలోకనం
మేము జమిందారులుగా ఉన్నప్పుడు మా కుటుంబం పరిస్థితులు ఎలా ఉండేవో నాకు తెలియదు. నేనెప్పుడూ పెద్ద ఇల్లు, ఇంటినిండా నౌకర్లూ ఉన్నచోట పెరగలేదు.
నా చిన్నప్పుడు, నాకు వూహ తెలిసి పరిసరాలను అర్థం చేసుకునేటప్పుడు, మేమొక చిన్న ఇంట్లో ఉండే వాళ్ళం.
మా నాన్న రోజంతా సమీపంలోని ఇంకో రైతు వరి మడిలో పనిచేసేవారు. పొలంలో పనిలేనప్పుడు రకరకాల పనులు చమటోడ్చి చేసేవారు. ఆయన చేయని, చేయలేని పనులంటూ లేవు, ఆయన అన్ని పనులును చేయగలిగేవారు.
మా నాన్న వేరే వాళ్ళ పొలంలో కూలికి పనిచేస్తున్నా, అందరూ ఆయన గురించి చాలా మర్యాదగా మాట్లాడేవారు. తనకంటూ ఒక చిన్న పొలంకూడా లేని ఒక పేద రైతుకి అంతటి మర్యాద దొరకడం ఆశ్చర్యంగా ఉండేది. ఆ వూరిలో దరిదాపు అందరూ మా నాన్న వల్ల సహాయం పొందిన వాళ్ళే.
మేము పక్కూరి జమీందారు బందువులమై కూడా, మేమెందుకు అటువంటి వూరిలో, ఒక చిన్న పూరిపాకలో ఉన్నామో అర్థమైయ్యేదికాదు. మా నాన్న తన బందువులతో, తోడపుట్టినవారితో ఎందుకు కలిసుండడం లేదో తెలిసేది కాదు. నా వయసు పిల్లలందరూ ఒక అమ్మతో ఉంటే, మరి నాకెందుకు ఇద్దరమ్మలు ఉన్నారో అర్థమైయ్యేది కాదు.
జమీందార్ జతింద్ర లాల్ దాస్ కొడుకు మహేంద్ర లాల్ దాస్ ఆయనే నా తండ్రి. ఆ “లాల్” అనే మద్య పేరు నాకెందుకో ఇబ్బందిగా అనిపించి, నేను నా ఎస్.ఎస్.సి కి దరఖాస్తు చేసేటప్పుడు తీసేసాను.
నా తల్లి శ్రీమతి సుప్రియా రాణి దాస్ పెళ్ళైన ఆరేళ్ళకు కూడా గర్భం దాల్చలేకపోయింది. ఆరేళ్ళ తరువాత మొత్తం కుటుంబం, మా అమ్మ అంతా కలిసి మా నాన్నకు బలవంతంగా రెండో పెళ్ళి చేసారు నా సవతి తల్లి శ్రీమతి మిష్టీ రాణి దాస్ తో.
పెళ్ళై ఇన్నేళ్ళైనా వంశాంకురాన్ని ఇవ్వలేకపోయిందని, మా పితామహులు, చిన్నాన్నలు మా
అమ్మను చాలా అవమానించి, హీనంగా, హేయంగా చూసేవాళ్ళు.
అదేం విచిత్రమో మా నాన్నకు రెండో పెళ్ళైన మూడు నెలలకు మా అమ్మ గర్భం దాల్చింది.
మా నాన్న విషతుల్యమైన ఆ ఇంట్లోనుంచి బయటకొచ్చి ఒక కొత్త జీవితం మొదలెట్టాలని, తన ఇద్దరు భార్యలతో, ఇంకా పుట్టని (నేను) బిడ్డతోబాటు ఆ జమీందారి ఇంట్లోనుంచి పక్కనున్న ఇంకో గ్రామానికి వచ్చేసారు.
మా నాన్న తన తండ్రి ఆస్తిని, భూములను ఏమాత్రం ఆశించలేదు, పైపెచ్చు ఆయన తన స్వశక్తితోనే తన కుటుంబాన్ని పోషించాలని శపధం చేసుకున్నారు.
మా నాన్నకు మతపరమైన నమ్మకాలు, మతం పైన విశ్వాసము చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడూ భగవాన్ శ్రీ కృష్ణుడ్ని పూజించేవారు, మహా భారతాన్ని చదివేవారు. అందువల్లనే ఆయన నాకు పాండవ మద్యముడు, కుంతీ పుత్రుడు, సాటిలేని విలువిద్యా నిపుణుడు ఐన అర్జునుని పేరు పెట్టారు.
జమీందారి ఇంట్లోంచి వచ్చేసిన ఎనిమిది నెలలకు నేను పుట్టాను.
నేను పుట్టిన తరువాత మా చిన్న కుటుంబం చాలా సంతోషంతో హాయిగా ఉండేది. కాని మా నాన్నకుఇంకా ఎక్కువ సంతోషం ఇవ్వాలి అని, తను రెట్టింపు కష్టపడి పనిచేసి కొద్దిగా డబ్బు కూడబెట్టారు ఏదైనా ఓ చిన్న వ్యాపారం మొదలెడదామని.
మా నాన్న తన చిన్ననాటి స్నేహితుడు, బందువు సహాయంతో చట్టగ్రాం సిటీ (బంగ్లాదేస్ లోని ఓ రేవుపట్టణం) వెళ్ళి ఒక చిన్న టీ కొట్టు మొదలెట్టరు. బాగా శ్రమకోర్చి కష్టపడడంతో టీ కొట్టు లాభాలు నెమ్మదిగా పెరగడం మొదలెట్టాయి. ఈ సమయంలో మా నాన్న వారానికొకసారి క్రమం తప్పకుండా ఇంటికి వచ్చేవారు. రెండేళ్ళ తరువాత మమ్మల్నందర్నీ తనతోపాటే సిటీలో ఉండడానికి తీసుకెళ్ళారు. నాకప్పుడు ఆరేళ్ళు. రేకులతో కప్పబడిన రెండుగదుల ఇల్లు మాకు రజియా వాళ్ళ నాన్న
అద్దెకు ఇచ్చారు.
దగ్గర్లోని స్కూల్లో నన్ను చేర్పించారు. అక్కడే నేను రజియాను కలిసింది, తరువాత తెలిసింది తను మా ఇంటి యజమాని కూతురని. మేమిద్దరం వెంటనే స్నేహితులైపోయాము, ఒకరింటికి ఒకరు తరచుగా వెళ్తుండేవాళ్ళం. నేను చిన్నగా ఉన్నఫ్ఫుడే ఆటల్లో, క్రీడల్లో చాలా నైపుణ్యం కనపరిచేవాన్ని. ఇంకొంచెం పెద్దగైన తరువాత నేను బాక్సింగ్, బరువులెత్తడంలో ఆసక్తి పెంచుకున్నాను.
కొద్ది సంవత్సరాలు అలా మా కుటుంబంలో సంతోషం వెల్లి విరిసింది. వెలుతురు తరువాత చీకటి కమ్ముకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. నాకు ఎనిమిదేళ్ళ వయసుండేటప్పుడు నా సవతి తల్లి, కవల పిల్లలైన నొకుల్, సహదేవ్ లను కని పురిటిలో చనిపోయింది. నా చిన్న తమ్ముడు తన పేరు (సహదేవ) చాలా పాతకాలం నాటి పేరులా ఉందని, తనని దేవ్ అని పిలవమని గొడవ చేసేవాడు, దానికి మేమందరం వొప్పుకోవాల్సి వచ్చింది.
వాళ్ళ అమ్మ నాకు సవతి తల్లైనా తనదగ్గరే నేనెక్కువ గారాబం చేసేవాడ్ని. మా అమ్మ నన్ను చాలా క్రమశిక్షణలో పెట్టేది, అందుకని నాకేమైనా ప్రత్యేకంగా కావాలంటే నేను మా మిష్టీ అమ్మ (తీయని అమ్మ) దగ్గరకే వెళ్ళేవాన్ని.
తన చావు నాకు, మా నాన్నకు చాలా బాధ కలిగించింది. కాని మా అందరికంటే ఆమె చనిపోవడం మా అమ్మ పైన చాలా తీవ్ర ప్రభావాన్ని చూపింది. కాలం గడిచేకోద్దీ మా అమ్మ, మిష్టీ అమ్మ ఇద్దరూ సొంత అక్కా చెల్లెల్లా కలిసిపోయారు, మా అమ్మ, తన చనిపోయినప్పుడు తన సొంత చెల్లెలే చనిపోయినంతగా ఏడ్చింది. ఇంత చిన్న 27 ఏళ్ళు వయసులోనే తన చెల్లెలు, స్నేహితురాలు చనిపోవడం మా అమ్మ జీర్ణించుకోలేకపోయింది.
మా అమ్మ నొకుల్, దేవ్ దగ్గరకు తీసుకుని మా మద్యలో ఏబేదం లేకుండా అందర్నీ తన సొంత బిడ్డల్లానే చూసింది. మేము ముగ్గురం ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల్లా చాలా అన్యోన్యతతో కలిసిమెలసి ఉండే వాళ్ళం. వాళ్ళకేదైన సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికే వచ్చేవాళ్ళు. వాళ్ళు నన్ను గౌరవించి, ప్రేమతో చూసేవాళ్ళు. వాళ్ళిద్దరూ చాలా మంచి పిల్లలు. కాని ఎవరైనా నా గురించి ఏదైనా చెడుగా అంటే మాత్రం వాళ్ళ ఇంకో రూపం చూపించేవాళ్ళు.
నా వరకైతే నేను వాళ్ళ పెద్దన్నని, వాళ్ళ బాగోగులు చూడడం నా బాధ్యత. వారికోసం నేనెప్పుడూ అందుబాటులో ఉండేవాన్ని. వారేం అడిగినా ఇవ్వడానికి ప్రయత్నించేవాన్ని. వారికోసం నేను తుపాకీ గుళ్ళను కూడా ఎదుర్కోవడానికి వెనుకాడను. వాళ్ళనంతగా నేను ఇష్టపడతాను.
అందుకే కాబోలు నాకింత బాధ వేస్తోంది. నేను నమ్మి, నావాళ్ళు అనుకున్న వాళ్ళే నాకింత ద్రోహం చేస్తారని అనుకోలేదు. నేను వాళ్ళనుండి ప్రేమ తప్ప ఇంకేమీ ఆశించలేదు, దానికి బదులుగా వాళ్ళు చేస్తున్న ఈ ద్రొహం నన్ను నిలువునా కాల్చేస్తోంది. కాని వాళ్ళని అస్యహించుకోలేక పోతున్నా. అది నన్ను నేనే అస్యహించుకున్నట్లు అనిపిస్తోంది.
చాలు ఇక, ఈ మోసాలు, కుతంత్రాలు, ఏడవడాలు. నేను నా మానసికస్థైర్యాని పెంచుకోవాలి, నేను నాకోసం బతకాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, ఇకనైనా బుద్ది తెచ్చుకుని, తెలివిగా మెలగాలి.
ఆగిన బండి కుదుపుకు తనలోకంలో వుండి గతం తాలూకు ఆలోచనల్లో ఉన్న అర్జున్ ఈ లోకంలోకొచ్చాడు.
ఆగిన బండి కుదుపుకు తనలోకంలో వుండి గతం తాలూకు ఆలోచనల్లో ఉన్న అర్జున్ ఈ లోకంలోకొచ్చాడు.
మేము రజియా ఇంటికి వెళ్ళేటప్పటికే సోహెల్, మురాద్ వచ్చేసి డ్రాయింగ్ రూం లోని సోఫాలో కూర్చుని టీ తాగుతూ టీవీ చూస్తున్నారు. వాళ్ళని పలకరించి, రజియా తన గదిలోకెళ్ళింది ఆసుపత్రి బట్టలు మార్చుకుని ఫ్రెష్ అవ్వడానికి, నేను డ్రాయింగ్ రూం పక్కనున్న వాష్ రూం కెళ్ళి మొహం కడుక్కుని ఫ్రెష్ అయ్యాను.
మేమందరం డ్రాయింగ్ రూం లో సమావేశమైయ్యాం.
సోహెల్, మురాద్ నా దెబ్బల గురించి అడిగితే వాళ్ళకు టూకీగా జరిగింది చెప్పాను.
ఏందుకింత అత్యవసరంగా కలవాల్సివచ్చిందొ అంటూ అడగగా రజియా వాళ్ళకు జరిగింది చెప్పింది. సోహెల్, మురాద్ ఇద్దరూ కాస్సేపు శిలలా అయిపోయారు మాటలురాక. కాస్సేపటికి సోహెల్ మాట్లాడుతూ
(సో: సోహెల్, ము: మురాద్, ర: రజియా, అర్: అర్జున్)
సోహెల్: మీకందరికీ తెలుసు నేను కుటుబ వకీలునని. గత కొద్దిసంవత్సరాలుగా నేను భార్యా భర్తలు ఒకరినొకరు మోసం చేసుకునే కేసులు, ద్రోహం చేసే కేసులు ఎన్ని చూసానంటే, ఇప్పుడు నాకేదీ కొత్తగా గాని, అశ్చర్యంగా గాని, వింతగా గాని అనిపించడంలేదు. కాని ఈ విషయం విన్నతరువాత నాకు కలిగిన ఆశ్చర్యాన్ని, తగిలిన షాక్ ను ఆపుకోలేక పోతున్నా. ఈ చోట బనిషా కాక వేరెవరున్నా నేను నమ్మేసేవాడ్ని, కాని బనిషా..? నేను నమ్మలేక పోతున్నా. నాకు అర్జున్, రజియాలతో పరిచయమున్నంత బాగా బనిషాతో పరిచయం లేదు, కాని నేను మనుషుల మనస్త్వతాలను చదవగలను, అది నా వృత్తి. కాని ఈ విషయం విన్న తరువాత నాపై నాకే అనుమానమొస్తోంది, అందులోనూ నీ తమ్ముళ్ళతో తను సంబందం పెట్టుకుందని విన్నప్పుడు. ఇదంత నమ్మశక్యం కావడం లేదు.
అర్జున్: ఈ రోజు ఉదయం నుంచీ అందరూ బనిషా తప్పుచేయదు అని చెప్పేవాళ్ళే, అసలు నేను నా కళ్ళతో చూసుండక పోతే, నేను కూడా నమ్మేవాన్ని కాదు.
సోహెల్: సరే కాని, దీని గురించి నీకింకేం తెలుసు, ఏమో బనిషా ఇదంతా ఇష్టపడి చేస్తుందో లేదో. ఇదంత అసలు ఎంతకాలం నుంచి నడుస్తోందో, వాళ్ళలా ఎందుకు చేస్తున్నారో నీకు తెలుసా? అసలు తెలుసుకోవాలనిపించిందా? ఇక్కడ ఈ పని చేస్తున్నవాళ్ళంతా నీ కుటుంబ సభ్యులు, దీన్ని నువ్వు ఎలా ఎదుర్కోదలిచావు?
రజియా: నాకేమనిపిస్తుందంటే, అసలు ఇదంతా ఎలా మొదలైందో నువ్వు ముందు తెలుసుకోవాలి. మీ ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందికదా. అటువంటప్పుడు తను నీకెందుకు ద్రోహం చేస్తోందో ముందు తెలుసుకో. తరువాత చేసేదేదో చేయవచ్చు.
అర్జున్: తనకు నాపైన ప్రేమ ఉందా? ఏమో, నాపై ప్రేమతోనే ఇదంతా చేస్తుంటే మరి నన్ను ద్వేషిస్తే ఇంకేమేమేం చేసేదొ? నువ్వన్నట్లు మొదట అసలు ఇదంతా ఎలా మొదలైందో, ఎందుకిలా చేస్తోందో తెలుసుకోవాలి, అది మనకెప్పటికైనా ఉపయోగపడుతుంది. కాని తెలుసుకోవడం ఎలా? నా మొత్తం కుటుంబ సబ్యులు ఇందులో ఉన్నారు, ఎవ్వరూ ఏమీ చెప్పరు నేనెంత మంచిగా అడిగినా కూడ.
రజియా: ఓ పని చేద్దాం. మొదట నీకు తెలిసినదంతా మరోసారి గుర్తుచేస్కో. గత కొద్ది వారాలుగా మీ ఇంట్లో వారి ప్రవర్తన నీకేమైనా అసహజంగా కాని, వింతగా కాని అనిపించిందా? ఎవైనా గుసగుసలు, అనుమానపు చిహ్నాలు అటువంటివి ఏవైనా…?
అర్జున్: నిజంగా చెప్పాలంటే అంటువంటిదేమీ నాకనిపించలేదు, నేను మామూలుగా….
ఇంతలో అకశ్మాత్తుగా నా ఫోన్ మొగడం మొదలెట్టింది. చూస్తే నా భార్య బనిషా కాల్ చేస్తోంది. నాకు తనతో మాట్లాడాలని లేదు, కాని రజియా ఫోన్ ఆన్ చేసి మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నిచమని ఒత్తిడి చేసింది.
బనిషా: హేయ్ లవ్, ఎలా ఉన్నావు?
అర్జున్: నేను బావున్నాను. నువ్వేం చేస్తున్నవ్? మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు?
బనిషా: అమ్మ పూజగదిలో ఉంది, నొకుల్ & దేవ్ చదువుకుంటున్నారు. నేనిప్పుడే వాళ్ళను చదివించడం పూర్తి చేసి మన గదిలోకి వచ్చాను.
అర్జున్: సరే, కాని ఈ రోజు వాళ్ళకు చాలా ఎక్కువసేపు చదువు చెప్పినట్లున్నావు, ఏంటి విషయం?
బనిషా: నొకుల్ కి రేపు టెస్తు ఉంది తన కోచింగ్ సెంటర్లో. అన్నట్లు ఇప్పుడు రాత్రి 8:30 అయ్యింది, ఎక్కడున్నావు నువ్వు?
అర్జున్: నేను రజియాను కలవడానికొచ్చాను, ఇప్పుడు అక్కడే వాళ్ళతోపాటు ఉన్నాను.
బనిషా: వావ్, ఫోను రజియాకిస్తావా, చాలా రోజులైంది తనతో మాట్లాడి.
నేను ఫోన్ రజియాకిచ్చాను.
బనిషా: హాయ్ రజి, ఏంటి విశేషాలు, మీ ఆయన, నీ కొడుకు, అత్తామామ ఎలా ఉన్నారు?
రజియా: బావున్నా. నా కొడుకు మా అమ్మానాన్నల దగ్గరికెళ్ళాడు కొన్ని రోజులు ఉండి రావడానికి. మా ఆయన, అత్తామామ కూడా బావున్నారు. వాళ్ళ గదిలో టీవీ చూస్తున్నారు. నీ గురించి చెప్పు, నువ్వెలా ఉన్నావ్?
బనిషా: నేనా, నేను చాలా సంతోషంగా ఉన్నా, ప్రతిది చాలా బావుంది.
రజియా: అవునా, నువ్వెందుకో ఇవాళ చాలా ఎక్కువ సంతోషంతో ఉన్నట్లు అనిపిస్తోంది..?
బనిషా: అంటే, నీ ఉద్దేశ్యం?
రజియా: హ..హా..జోక్ చేసాలే. వచ్చే మంగళవారం కలుద్దాం, నీ మామూలు మెడికల్ చెకప్ కు ఆలస్యం చేయొద్దు, ఉంటా, బాయ్.
బనిషా: బాయ్, గుడ్ నైట్, ఫోన్ మా ఆయనకివ్వవా ప్లీజ్.
అర్జున్: నేనింకో గటలో అక్కడ ఉంటాను, బాయ్.
బనిషా: ఓకే లవ్, అప్పుడే కలుద్దాం.
ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు బనిషా చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపించింది. ఆమె సంతోషానికి కారణం నేనేనా? నా తమ్ముళ్ళకు ఇంతసేపటి వరకు చదువు చెప్పడం కాస్త వింతగా ఉంది. మామూలుగా సాయంత్రం 6 గంటలకంతా అది అయిపోతుంది. నేను తనని చూసింది సాయంత్రం 4 గంటలకు, తను వాళ్ళకు చదువే చేప్తోందా?
రజియా: సరే అర్జున్ మనమెక్కడ ఉన్నాము?
అర్జున్: ఆ..ఏంటి?
రజియా: ఫోన్ రావడానికి ముందు నువ్వేం చెప్ప్తున్నావు?
అర్జున్: ఆ..నేను మామూలుగా రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగి వెళ్తాను, కాస్సేపు అందరితో సమయం గడిపి, కాస్సేపు టీవీ చూసి, భోంచేసి పడుకుంటాను. నాకేవిదమైన వ్యత్యాసం కనిపించలేదు.
రజియా: సరే, ఈ రోజు మంగళవారం. నువ్వు కాస్త మెలకువగా ఉండాలి. నువ్వు గదిలో ఉన్నఫ్ఫుడు వాళ్ళేమన్నా సైగలు లాంటివి చేసుకుంటారా అని గమనించు. మనమికేదైనా చేయాలి ఇంకా ఎక్కువ ఆ ఇంటి విషయాలను తెలుసుకోవడానికి.
అర్జున్: చూడండి, మీ అందరికి నేనెలా కనిపిస్తున్నాను, ఒక చవటలా, పనికిమాలినవాడిలా కనిపిస్తున్నానా? అసలు మీరంతా ఏం చేస్తున్నారో తెలుసా?
రజియా: నువ్వు వాళ్ళని నమ్మావు అందుకే నీకు వాళ్ళపైన ఎలాంటి అనుమానము కలుగలేదు. అదే కాదా కుటుంబమంటే. నమ్మకం. వాళ్ళకోసం నువ్వెన్ని త్యాగాలు చేసావో నాకు తెలుసు. నేను నీ స్నేహితురాల్ని, మేమందరం నీ స్నేహితులమే. నీ కష్టకాలంలో మేమంతా నీ తోడుంటాం, నువ్వేం దిగులు పడొద్దు.
అర్జున్: సరే ఐతే, ఇక నే వెళ్తా, అప్పుడే రాత్రి 9 గంటలైంది
సోహెల్: నేను కూడా వెళ్ళాలి, నేను రేపు మీకు ఫోన్ చేసి చెప్తా ఏం చేయాలో
రజియా: ఏయ్, ఆగండి. మీరిద్దరూ ఇక్కడ భోంచేసి వెళుతున్నారు. మిమ్మల్ని అలా ఏలా ఉత్త కడుపుతో పంపేస్తాననుకున్నారు?
అర్జున్: రజి, పరవాలేదు, నేను నిజంగా బయలుదేరాలి.
సోహెల్: నేను కూడా
చిరు కోపంగా
రజియా: నేను మీ అభిప్రాయలను అడగలేదు, మర్యాదగా చేతులు కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గరకు పదండి. నాకో 5 నిముషాలు పడుతుంది అన్నీ తయారుచేయడానికి.
మేము మా భొజనం ముగించేసి మా మా ఇళ్ళకు బయలుదేరాము. నేనొ టాక్సీని ఆపి ఎక్కబోతుంటే నా ఫోన్ మోగింది. డ్రైవర్ కు ఎక్కడికెళ్ళాలో చెప్పి ఫోన్ ఆన్ చేసా. నొకుల్ ఆ పక్కనుంచి
నొకుల్: నమస్కరం అన్నా ( పెద్దలను మర్యాదగా పలకరించడం), ఎలా ఉన్నారు?
అర్జున్: బావున్నా
నొకుల్: అమ్మ నీతో మాట్లాడాలంట, ఫోన్ తనకిస్తున్నా
అమ్మ: నాన్నా (కొడుకా) ఎక్కడున్నావు? ఈ రోజింత ఆలస్యం ఎందుకైంది?
అర్జున్: రజియాను, మురాద్ ను కలవడానికి వెళ్ళను, ఇంకో అర్ద గంటలో అక్కడ ఉంటాను.
అమ్మ: తొందరగా రా బిడ్డా. నాకెందుకో ఈ రోజు చాలా అపశకునాలు కనిపించాయి. నిన్ను వెంటనే చూడాలనిపిస్తోంది, నువ్వేదో బాధలో ఉన్నట్లు, సమస్యలో ఉన్నావనిపిస్తోంది. తొందరగా రా నాన్నా.
అర్జున్: అలాగే అమ్మా, నేను బానే ఉన్నానులే, నువ్వేం దిగులు పడకు. వస్తున్నా, సరేనా.
నాపై ఎంత ప్రేమ చూపిస్తోందో, ఇదంతా నిజమేనా లేక నటన? మా అమ్మ ఎలా తన కోడలి చేత వ్యభిచారం, అదికూడా సొంత కుటుంబ సభ్యులతో చేయిస్తోందో? ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి? నమ్మకం లేనిచోట కుటుంబానికి అర్థం లేదని కదా మురాద్ అన్నాడు. అలాంటప్పుడు వీళ్ళు నా కుటుంబ సభ్యులా? వీరిలో ఎవరిని నమ్మాలి, ఎవరినైనా ఎప్పటికైనా నమ్మగలనా? కాలమే దీనికి బదులివ్వాలి.
రజియా, మురాద్ వాళ్ళ బెడ్రూంలో అర్జున్ గురించి మాట్లాడుకుంటూ
రజియా:”తన మనస్థితి, శారీరిక పరిస్థితి రెండూ బాలేవు. సరిగా నడవలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. అర్జున్ ప్రతిక్రియ ఈ పరిస్థితిలో ఏమైనా వింతగా, కొత్తగా ఉంటే, బనిషా, సుప్రియా పిన్నికి ఏమైనా అనుమానమొస్తుందో ఏమో తనకు ఏదో తెలిసిందని.”
మురాద్: అతను తనను తాను సంభాళించుకోవాలి, లేకపోతే వాళ్ళకు తప్పనిసరిగా అనుమానమొస్తుంది. అయినా తనకు దెబ్బలు తగిలున్నాయి కదా, తన ప్రవర్తనకు అది కూడా ఓ కారణమనుకోవచ్చు.
రజియా: అర్జున్ చిన్నప్పటి నుండీ చాలా నెమ్మదైన వాడు, గంభీరంగా ఉంటూ తన పనేదో తాను చేసుకుంటూ వెళ్ళేవాడు. తరగతిలో అతనే అందరికంటే పొడుగ్గా, బలంగా ఉండేవాడు. ఎప్పుడూ బలహీనులకు సహాయపడుతుండే వాడు. ఎప్పుడూ ఎవరో ఒకరికి సహాయ పడుతుండేవాడు. నీకు తెలుసా నా హెచ్.ఎస్.సి. పరీక్షలప్పుడు నాకో చిన్న ప్రమాదం జరిగితే, అర్జున్ వల్లనే నేనా పరీక్ష రాయగలిగాను. నా వల్ల అతను ఓ గంట ఆలస్యంగా తన పరీక్ష రాయడానికి వెళ్ళాల్సివచ్చింది.
మురాద్: ఓ, అదే పరీక్షనా అతను ఫెయిల్ అయ్యింది నీకు సహాయం
చేస్తూ?
రజియా: కాదు, దాంట్లొ అతనికి ఏప్లస్ వచ్చింది, అతను ఇంగ్లీషు చాలా బాగా చదివేవాడు. అవి అతని ఆఖరి రెండు పరీక్షలు, వాల్ల నాన్న చనిపోవడం వల్ల తను రాయలేకపోయాడు. అంతకుముందు అతనెప్పుడూ ఏ తరగతిలోనూ ఫెయిల్ అవ్వలేదు.
మురాద్: అంటే అతను కొబ్బరికాయ లాంటి వాడన్నమాట. బయటకి గట్టిగా, కఠినంగా కనిపించినా లోపల తియ్యగా, మెత్తగా ఉన్నట్లు.
రజియా: అర్జున్ బలంగా కనిపించడమేకాదు, చాలా బలవంతుడే. ఒకసారి ఏమైందంటే మా కాలేజి రోజుల్లో సోహెల్ని, వాడి గర్ల్ ఫ్రెండ్ని కాపాడటం
కోసం తనొక్కడే నలుగుర్ని కొట్టిపడేసాడు.
మురాద్: బేబీ నాకు అర్జున్ స్ట్రాంగని తెలుసు, నేనూ తనెళ్ళే వ్యాయామ
శాలకే వెళ్తాను, నేను కూడా స్ట్రాంగే నీకలా అనిపించడం లేదా?
కొంటెగా కవ్విస్తూ
రజియా: ఐతే నువ్వు స్ట్రాంగన్నమాట, మరెందుకు లైట్ ఆర్పేసి మంచం పై నువ్వెంతటి బలమైన పులివో నాకు చూపించకూడదు?
నవ్వుతూ
మురాద్: దానికి లైటెందుకు ఆర్పడం? లైటుండగానే చూపిస్తాను నేనెటువంటి రాయల్ బెంగాల్ పులినో.
అదే రోజు సాయంత్రం 6:30 కి అర్జున్ అపార్ట్మెంట్ ఇంట్లో….
అత్త (అర్జున్ అమ్మ), కోడలు ( అర్జున్ భార్య) ఇద్దరూ పూజగదిలో కూర్చుని పవిత్ర గ్రంధమైన భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలు చదువుతున్నారు. ఆ రోజు అధ్యాయం చదివి, పూజ పూర్తైనపిమ్మట కూడా తన అత్త దిగులుగా, ఏదో పోగొట్టుకున్నట్లు ఉండడం గమనించి తన అత్తతో
బనిషా: మీరేదొ దిగులుగా కనిపిస్తున్నారు, ఆరోగ్యం బాలేదా?
అత్త: అవును, బాలేదు.
బనిషా: దేనిగురించి అత్తా?
అత్త: ఇవాళ ఏదో మనసంతా బాధగా ఉంది. పొద్దున్నుంచి ఎందుకో తెలియదు ఒకటే అశాంతిగా ఉంది. ఎందుకో తెలియడం లేదు అర్జున్ ఇవాళ మాటిమాటికి గుర్తొస్తున్నాడు. పొద్దున అర్జున్ వెళ్ళిన అరగంటకే దేవ్ కు చెప్పి కాల్ చేయమన్నా. అర్జున్ బిజీగా ఉంటేకూడా పర్లేదు, ఓసారి కాల్ చేయవా ప్లీజ్…
బనిషా: పర్లేదు అత్తా, మీకు తెలుసుగా పనిలో ఉన్నప్పుడు సరైన కారణం లేకుండా ఫోన్ చేస్తే ఆయనకు నచ్చదని. ఎలాగూ ఇంకో 30-40 నిముషాల్లో ఆయన వచ్చేస్తారు కదా
అత్త: తెలుసు, ఐనా ఎందుకో నాకదోలా ఉంది మనసంతా…
బనిషా: (కొద్దిగా సంశయిస్తూ) అత్తా మనమీవిదంగా తనని మోసం చేయడం మీ అంతరాత్మకు తప్పనిపిస్తోందో ఏమో..
అత్త: ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనమేమీ అతనికి ద్రోహం లేక వేరే ఏమీ చేయడం లేదు. మనము అతనికి చెడు ఏమీ చేయడం లేదు, అతని మంచి కోసమే చేస్తున్నాము. నేను నా పిల్లలకు, నీతోపాటు ఏది మంచిదో అదే ఇస్తాను. మనమిదంతా అర్జున్ కోసమే చేస్తున్నాము.
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .