Tollywood News

హనీమూన్ లో నవ దంపతులు! ఆ ఒక్క మెసేజ్ కాపురాన్ని నిలువునా కూల్చేసింది!

హనీమూన్ లో నవ దంపతులు! ఆ ఒక్క మెసేజ్ కాపురాన్ని నిలువునా కూల్చేసింది!

హనీమూన్ లో నవ దంపతులు! ఆ ఒక్క మెసేజ్ కాపురాన్ని నిలువునా కూల్చేసింది!

వాళ్లిద్దరూ గత 15 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈ మధ్యే ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే.. హనీమూన్ లో అసలు నిజం బయటపడి కాపురం నిట్ట నిలువునా కూలిపోయింది. అసలేం జరిగిందంటే?

చూడటానికి ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ జంట 15 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే పెద్దలను ఒప్పించి ఇటీవల ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి అనంతనం ఈ నవ దంపతులు హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. నూతన దంపతులు హనీమూన్ లో ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. హనీమూన్ లో భాగంగా ఈ నవ దంపతులు ఇటీవల ఓ పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. వారి జీవితంలో మధురానుభూతిని హనీమూన్ లో అస్వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఆమె భర్తకు ఓ మేసేజ్ వచ్చింది. అది చదివిన నవ వధువుకు ఒక్కసారిగా దిమ్మతిరిగింది. దీంతో వారి కాపురం నిలువునా కూలిపోయింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి ప్రాంతంలో కౌసల్య అనే యువతి నివాసం ఉండేది. ఈమెది పెద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఇక ఇదే గ్రామంలో సంపన్నుడైన సుకేష్ అనే యువకుడు నివాసం ఉండేవాడు. దీంతో వీళ్లిద్దరూ గత 15 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారిపోయారు. చివరికి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఈ మధ్యకాలంలో ఇద్దరు పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలం పాటు ఇద్దరు సంతోషంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే సుకేష్ హనీమూన్ వెళ్లాలని ప్లాన్ వేసుకున్నాడు.

దీంతో ఈ నూతన దంపతులు హనీమూన్ లో భాగంగానే ఇటీవల ఓ పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి చేరుకుని జీవితంలోని ఓ అద్భుత ఘట్టమైన ఆ మధురానుభూతిని ఆస్వాదిస్తున్నారు. సంతోషంగా ఆడుతూ పాడుతూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సుకేష్ ఫోన్ కు వాట్సాప్ లో.. నేను నీకు అవసరం లేదు కాదా? నాకు తిరిగి ప్రేమను ఇవ్వలేకపోయావు అంటూ.. ఓ మేసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చదివిన భార్య కౌసల్యకు ఒక్కసారిగా దిమ్మ తిరిగినంత పనైంది. ఏంటా అని.. కౌసల్య అదే నెంబర్ మీద ఉన్న వాట్సాప్ మెసేజ్ లు అన్నీ చదివింది. భర్త సుకేష్ తన కోడలు అయినా అస్థికతో ఎఫైర్ నడిపిస్తున్నాడని కౌసల్య తెలుసుకుంది. దీంతో వెంటనే ఆ దంపతులు తిరిగి ఇంటికి వచ్చారు. వచ్చి రాగానే కౌసల్య ఇదే విషయాన్ని అత్తమామలకు వివరించింది.

కోడలు మాటలు విన్న సుకేష్ తల్లిదండ్రులు.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినని ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురైంది. 15 ఏళ్లుగా పిచ్చిగా ప్రేమించిన కౌసల్యకు నమ్మలేని నిజం బయట పడింది. దీంతో ఆ యువతి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఇక విటన్నిటినీ తట్టుకోలేకపోయిన ఆ యువతి.. ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణవార్త తెలుసుకున్న కౌసల్య తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో మాత్రం సుకేష్.. వరుసకు కోడలయ్యే అస్థికతో వివాహేతర సంబంధాన్ని నడిపించినట్లు బయటపడింది. దీంతో పోలీసులు భర్త సుకేష్, అత్తమామలు, కోడలు అస్తికను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. 15 ఏళ్లు ప్రేమించిన యువతి నమ్మించి గొంతు కోసి, చివరికి నిండు కాపురాన్ని నిలువునా చీల్చుకున్న సుకేష్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

 

 

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button