Tollywood NewsTrending News

దర్శకుడు, రచయిత మీద ముకేశ్ ఖన్నా తీవ్రంగా విమర్శలు, ప్రభాస్ ని కూడా వదల్లేదు…

దర్శకుడు, రచయిత మీద ముకేశ్ ఖన్నా తీవ్రంగా విమర్శలు, ప్రభాస్ ని కూడా వదల్లేదు...

దర్శకుడు, రచయిత మీద ముకేశ్ ఖన్నా తీవ్రంగా విమర్శలు, ప్రభాస్ ని కూడా వదల్లేదు…

దర్శకుడు, రచయిత మీద ముకేశ్ ఖన్నా తీవ్రంగా విమర్శలు, ప్రభాస్ ని కూడా వదల్లేదు...
దర్శకుడు, రచయిత మీద ముకేశ్ ఖన్నా తీవ్రంగా విమర్శలు, ప్రభాస్ ని కూడా వదల్లేదు…

‘ఆదిపురుష్’ #Adipurush సినిమా మీద రోజు రోజుకీ విమర్శల వెల్లువ ఎక్కువవుతోంది. ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon), సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan), సన్నీ సింగ్ (SunnySingh) నటించిన ఈ సినిమాకి ఓం రౌత్ (OmRaut) దర్శకుడు. ఈ సినిమా గత వారం జూన్ 16న విడుదల అయింది. అప్పటినుండీ ఈ సినిమా మీద దేశం అంతటా నిరసనలు, విమర్శలు చేస్తూనే వున్నారు. ఈ సినిమాని నిషేధించాలని కూడా కొందరు కోరుతున్నారు. ఒకప్పుడు ‘శక్తిమాన్’ #Shaktiman గా అందరికీ పరిచయం అయిన నటుడు, అలాగే ‘మహాభారత్’ #Mahabharath లో భీష్మ పితామహ (Bheeshma) గా కూడా ప్రేక్షకులని మెప్పించిన ముకేశ్ ఖన్నా (MukeshKhanna) ఇప్పుడు ‘ఆదిపురుష్’ సినిమా, టీము మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

adipurushvfx.jpg

అసలు దర్శకుడు ఓం రౌత్, మాటల రచయిత మనోజ్ ముంతాషి (Manoj Muntashi) ఈ సినిమా తీసే ముందు రామాయణం #Ramayanam చదివారా అని ప్రశ్నించాడు ముకేశ్. మనోన్ స్క్రీన్ ప్లే, మాటలు చాలా వరస్ట్ గా ఉన్నాయని ముకేశ్ చెప్పాడు. ఒక మహా గ్రంధం అయిన రామాయణాన్ని అపహాస్యం చెయ్యడానికి ఈ సినిమా తీశారు అని చెప్పాడు. రావణుడి పాత్ర డిజైన్ చేసే విధానాన్ని, ఆ పాత్రని మలిచిన తీరుని కూడా ముకేశ్ తప్పు బట్టాడు. “అసలు రావణుడి పాత్రకి సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan) ఎలా దొరికాడు నీకు. రావణుడు ఒక స్ముగ్లర్ లా కనిపిస్తున్నాడు ఇందులో” అని చెప్పాడు ముకేశ్ ఖన్నా.

అసలు ఈ సినిమా గురించి మాట్లాడకూడదు అనుకున్నాడుట, కానీ ఒక యూసర్ ఈ సినిమా ఫన్ అండ్ కామెడీ అని పెట్టాడట. దానితో ముఖేష్ ఖన్నా ఈ సినిమా గురించి మాట్లాడవలసి వచ్చింది అన్నాడు. “రామాయణం కామెడీ ఎలా అవుతుంది. రామాయణం ఆధారంగా తీసిన చెత్త డ్రామాలో ఇది ఒకటి, రామాయణం ని అపహాస్యం చెయ్యడానికే ఈ ‘ఆదిపురుష్’ సినిమా తీశారు,” అని చెప్పాడు ముకేష్ ఖన్నా.

adipurushwar.jpg

అతను ప్రభాస్ ని కూడా వదలలేదు. అతను కేవలం తన బాడీ చూపించడానికి ఇందులో పనికొచ్చాడు అన్నట్టుగా చెప్పాడు. రాముడు పాత్ర అంటే బాడీ ఉంటే సరిపోదని చెప్పాడు. దర్శకుడు ఓం రౌత్, మాటల రచయిత మనోజ్ ముంతాశి లని తీవ్రంగా విమర్శించాడు ముఖేష్ ఖన్నా.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button